ఏపీ కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాలు మరోసారి హీటేక్కాయి.ఇటివల జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ పార్టీ తరపున బరిలోకి నిలిచిన భూమా బ్రహ్మానందరెడ్డి వైసీపీ తరపున బరిలోకి దిగిన శిల్పా మోహన్ రెడ్డిపై గెలుపొందిన సంగతి తెల్సిందే .ఈ క్రమంలో ఆ విషయం మరిచిపోకముందే నంద్యాల మున్సిపల్ పరిధిలో రాజకీయాలు హీటేక్కాయి .సరిగ్గా ఐదేండ్ల కిందట అంటే 2013లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అప్పుడు టీడీపీ ఇంచార్జ్ గా ఉన్న శిల్పా మోహన్ రెడ్డి ముప్పై ఆరు వార్డుల్లో అభ్యర్థులను గెలిపించారు .ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొందిన ఎమ్మెల్యే దివంగత భూమా నాగిరెడ్డి తనతో పాటు పద్దెనిమిది కార్పోరేటర్లతో టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు .
see also:టీడీపీ ఎమ్మెల్యేకు పవన్ వార్నింగ్..నీ కొడుకును అదుపులో పెట్టుకో
అయితే కొంతకాలానికే శిల్పా ,భూమా మధ్య గొడవలు రావడంతో శిల్పా మోహన్ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ దేశం సులోచన ,పదహారు మంది కౌన్సిలర్లు వైసీపీ గూటికి వచ్చారు .ఇక్కడే అసలు రాజకీయం హీటేక్కింది.దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డితో టీడీపీలో చేరిన వైసీపీ కౌన్సిలర్లతో కల్పి టీడీపీ బలం ఇరవై ఆరు మంది .ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ,శాసనమండలి చైర్మన్ గా ఎండీ ఫరూక్ ఓటు హక్కుండటంతో మొత్తం టీడీపీ బలం ఇరవై ఎనిమిది మంది అయింది .అయితే వైసీపీలో ఉన్న మున్సిపల్ చైర్ పర్సన్ దేశం సులోచన మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని టీడీపీ కుట్రలు చేస్తుంది .
see also:ఈ నెల 6న వైసీపీలోకి బైరెడ్డి సిద్దార్థరెడ్డి..?
అయితే అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సంఖ్యాపరంగా మొత్తం నలబై నాలుగు మంది ఉండటంతో అందులో మూడు వంతులో రెండో భాగం మెజారిటీ ఉండాలి .అంటే సంఖ్యా పరంగా ముప్పై ఒక్కటి మంది ఉండాలి .కానీ టీడీపీ బలం ఇరవై మంది ..వైసీపీ బలం పదహారు మంది .దీంతో రాజకీయాల్లో ఆరితేలిన శిల్పా వైసీపీకున్న పదహారు మంది చేజారకుండా ప్రణాళికలు రచిస్తున్నారు .శిల్పా దెబ్బకు ఇటు టీడీపీ అటు భూమా అఖిల ప్రియకు దిమ్మతిరిగి బొమ్మ కన్పించింది .దీంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయేలా చేయబోతున్నాడు శిల్పా ..