తల్లిదండ్రులు వారి పిల్లలు తమ చదువు, ఆటపాటలతో కాకుండా వెర్రిమొర్రి వేషాలు వేస్తే తల్లిదండ్రలకు కి ఎలా ఉంటుంది? అసలే ఇంటిపనితో రెక్కలు ముక్కలు చేసుకొంటుందేమో అరికాలి మంట నెత్తికెక్కుతుంది కదా. సరిగ్గా ఇదే జరిగింది ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
అసలు ఏం జరిగిందంటే బట్టలు ఉతికి ఆరేయడానికి తలుపు తెరిచిన ఆ తల్లికి తన ఇద్దరు ఈడొచ్చిన ఆడపిల్లలు అసభ్యంగా డాన్సులు చేయడం కనిపించింది. అంతే కాదు.. దానిని కెమెరా సెట్ చేసుకొని రికార్డు కూడా చేస్తున్నారు. పిల్లల చెత్తవేషాలు చూసిన ఆమెకి చిర్రెత్తుకొచ్చింది. వెంటనే తన కాలికున్న చెప్పు తీసి ఇద్దరినీ ఎడాపెడా వాయించేసింది. వీళ్లు స్పానిష్ వాళ్లు అయి ఉండొచ్చని వాళ్ల తీరుతెన్నులు, ముఖకవళికలు చూసినవాళ్లు అనుకుంటున్నారు. ఈ వీడియో పెట్టిందెవరో తెలియనప్పటికీ ఇది కచ్చితంగా ఆ ఇద్దరు పిల్లలే అప్ లోడ్ చేశారని భావిస్తున్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వీడియోతో తాము చిన్నబోవాల్సి వస్తుందని వారు ఊహించి ఉండరు పాపం.