తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గత నాలుగు ఏళ్ళుగా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారు .ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గేడం కిరణ్ ,మంజుల దంపతులు ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల ఉన్న తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు .
see also:మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం.. మేయర్ నరేందర్
అందులో భాగంగా మొత్తం వెదురు కర్రలతో కూడిన ముఖ్యమంత్రి కేసీఆర్ విగ్రహాన్ని రూపొందించి తమకు అభిమాన నాయకుడి పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు .ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రెండు పడకల ఇల్లు ,మిషన్ భగీరథ ,హరితహారం పథకాల గుర్తులు అందులో ఉండేలా దిన్ని రూపొందించారు .అంతే కాకుండా టీఆర్ఎస్ పార్టీ గుర్తు కారు చిత్రాలను కూడా వెదురు కర్రలతో చేసి వాటి మధ్యన ముఖ్యమంత్రి కేసీఆర్ వెదురు విగ్రహాన్ని ఉంచారు ..