వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటికి 205వ రోజుకు చేరుకున్న విషయం తెలిసిందే. కాగా, పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌ను కలుసుకుని.. వారి సమస్యలను తెలుపుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. జగన్‌తో తమ కష్టాలు చెప్పుకుని కన్నీరుమున్నీరవుతున్నారు. జగన్ వారిలో తానున్నానన్న భరోసాను నింపుతూ ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ముందుకు సాగుతున్నారు.
కాగా, 205వ రోజు పాదయాత్ర చేస్తున్న జగన్‌ను పలువురు వాహనదారులు కలిశారు. తమ వాహనాలకు సంబంధించిన నెంబర్‌ప్లేట్లపై వైఎస్ జగన్ ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. అయితే, ఆ నెంబర్ ప్లేట్లపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బొమ్మ ఉండటం గమనార్హం. ఇలా ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న వాహనాల నెంబర్లపై వైఎస్ఆర్ చిత్రం, అలాగే, జగన్ ఆటో ట్రాఫ్ ఉండటం విశేషం.