వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. కాగా, ఇవాళ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మీడియాతో ఆట్లాడుతూ.. మాస్ ఫాలోయింగ్‌లో జగన్‌కు ఏ మాత్రం తీసిపోనని, తాను కనుక పాదయాత్ర చేస్తూ జగన్ కంటే ఎక్కువ మంది ప్రజలు తరలి వస్తారని చెప్పారు.
ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైఎస్ జగన్ తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్న తీరు బాధాకరమన్నారు. ఇసుక దోపిడీ చేశానని చెబుతున్న జగన్.. ఆధారాలతో సహా నిరూపించాలని సవాల్ విసిరారు. ఏపీ అభివృద్ది కోసం సీఎం చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజా సంకల్ప యాత్రకు పెద్దగా ప్రజలు స్పందన చూపకపోవడంతో.. ఏమీ తోచని స్థితిలో వైఎస్ జగన్ తనపై విమర్శు చేశారే తప్ప.. ఆ విమర్శలు నిరాదారమైనవని చెప్పారు.