టాలీవుడ్‌లో చాలా మందే హీరోయిన్లు ఉన్నారు. అలా అని, దర్శ క నిర్మాతలు కొందరు సుందరీమణులను అరువు తెచ్చుకోవడం మానడం లేదు. ఇందులో అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే..? వారి రెమ్యునరేషన్ విషయంలో చాలా తేడా ఉంటుంది. టాలీవుడ్ చందమామ కాజల్ ప్రస్తుతం కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. మరికొందరు మాత్రం అనుకున్న దానికంటే తక్కువ తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
see also:కన్నడ సినిమా సెట్‌లో మంత్రి కేటీఆర్
ఇంతకీ ఏం జరిగిందంటే..? దగ్గుబాటి వెంకటేష్, నాగ చైతన్య నిజజీవితంలోనూ మామ అల్లుళ్లన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ ఇప్పుడు ఒక మల్టీస్టారర్ సినిమా తీసేందుకు శ్రీకారం చుట్టారు. నాగచైతన్య కోసం రారండోయ్ వేడుక చూద్దాం చిత్రంలో తన పక్కన నటించిన రకుల్ ప్రీత్ సింగ్‌నే తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు వెంకీ మామ అనే టైటిల్ దాదాపు ఖరారైనట్టే. వెంకీ పక్కన నటించేందుకు బాలీవుడ్ బ్యూటీ హ్యూమా కురేషీని తీసుకున్నారన్న రూమర్ ఇప్పుడు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.
see also:ఫుట్‌బాల్ ప్లేయర్‌గా సాయి పల్లవి..!
హ్యూమా ఇది వరకు చిత్రాలు హిట్ సాధించకపోయే సరికి వెంకీ మామా చిత్రం తనకు బ్రేక్ ఇస్తుందని ఆశల్లో ఉంది. అయితే, ఈ మధ్యన హ్యూమా నటించిన కాలా చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టిన విషయం తెలిసిందే. దీంతో వెంకీ మామా చిత్ర బృందం ఈమెకు ఇచ్చే రెమ్యునరేషన్‌లో తేడా చూపిస్తున్నట్టు తెలుస్తోంది., కొంత డిస్కౌంట్ ఇవ్వాలని నిర్మాతలు ఆమెను కోరుతున్నారట. ఈ విషయంలో హ్యామా తగ్గకపోతే.. వేరే హీరోయిన్‌ను తీసుకునేందుకు చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
see also:పందిపిల్లతో రవిబాబు పుషప్స్..!