కోటిలింగాల వద్ద బాణసంచా తయారి కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదం విచారకరమని,ఈ సంఘటన తీవ్ర దిగ్బ్రాంతిని గురిచేసిందని మేయర్ నన్నపునేని నరేందర్ అన్నారు.సంఘటనా స్థలానికి వెల్లి ప్రమాదం ఎలా జరిగిందో అడిగితెలుసుకున్నారు.అనంతరం MGM మార్చురిలో ఉంచిన మృతదేహాలను సందర్శించి వారి కుటుంభసభ్యులను పరామర్శించారు.
ఈ సందర్బంగా మీడియా తో మాట్లాడుతూ ఈ ఘటన చాలా భాదాకరమని,హృదయవిదారకరమైన ఘటన అని మేయర్ అన్నారు.ఈ అగ్నిప్రమాదంలో ప్రాణాలో కోల్పోయిన వారంతా పేద కుటుంబానికి చెందిన వారేనని వారికుటుంబాలకు అన్ని విదాలుగా అండగా నిలస్తామని మేయర్ అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ఘటన జరిగిన వెంటనే సానుబూతి వ్యక్తపరుస్తూ మృతుల కుటుంబాలకు 5లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారని,గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు.
వీటితో పాటు బాదితుల పిల్లలు,మరియూ బాదిత కుటుంబం బాగోగుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో మాట్లాడి అన్నిరకాలుగా వారిని ఆదుకుంటామని మేయర్ తెలిపారు.చట్టపరమైన విచారణ జరిపించి బాణసంచా తయారీ కేంద్రంపై చర్యలకు కృషిచేస్తామని ఆయన తెలిపారు.ఈ సందర్బంగా మేయర్ తో మహిళా కమీషన్ చైర్మన్ గుండు సుదారాణి,తెరాసా కార్యదర్శి బస్వరాజు సారయ్య,తెరాసా నాయకుడు ఎర్రబెల్లి ప్రధీప్ రావు,కార్పోరేటర్లు కుందారపు రాజేందర్,తెరాసా నాయకులు బిల్లా శ్రీకాంత్,సయ్యద్ మసూద్,బాబు,జోషి తదితరులు వారితో ఉన్నారు.