ఈ మధ్య కాలంలో ఏపీ రాజకీయాలు వాడీ, వేడీగా సాగుతున్నాయి. దీంతో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో నువ్వా..? నేనా..? అన్నట్టు రాజకీయ పార్టీల మధ్య చతుర్ముఖ పోటీ నెలకొననుంది. అయితే, ఇప్పటి వరకు పలు పార్టీల అధినేతలు ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే, ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవీ బాధ్యతలు చేపట్టినప్పట్నుంచి.. రాష్ట్రంలో అవినీతి హెచ్చుమీరిందని, అందుకు సాక్ష్యం చంద్రబాబు నియమించిన జన్మభూమి కమిటీలేనని ప్రజలు బాహాటంగా విమర్శిస్తున్నారు. సామాన్యుల నుంచి ప్రభుత్వ అధికారు వరకు టీడీపీ శ్రేణుల దాడికి గురవ్వాల్సిన పరిస్థితి ఏపీలో ఉందని, దీనికంతటికి కారణం చంద్రబాబు అవినీతి పాలనేనన్నది ప్రజల అభిప్రాయం. ఇందుకు నిదర్శనంగా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రభుత్వ మహిళా అధికారిపై చేయి చేసుకున్నా సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా.. దాడిలో తీవ్రంగా గాయపడ్డ మహిళా తహశీల్దార్ వనజాక్షి చేత టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనికి క్షమాపణ చెప్పించడం యావత్ రాష్ట్రాన్ని ఆశ్చర్య పరిచింది. ఇలా చంద్రబాబు అవినీతి కార్యకలాపాలతో తన అనుచర వర్గాన్ని కాపాడుకుంటూ వస్తున్నారని రాజకీయ విశ్లేషకుల మాట.
ఇదిలా ఉండగా, ప్రభుత్వపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతున్న క్రమంలో చంద్రబాబు మరో కుట్రకు తెర తీశారు. అవినీతికి పాల్పడుతున్న టీడీపీ శ్రేణులపై వేటు వేస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. అయితే, అందులో భాగంగా తాడిపత్రి నియోజకవర్గం టీడీపీ నేతలు బీ.జగదీశ్వర్‌రెడ్డి, ఆయన సోదరుడు రామచంద్రారెడ్డిలను పార్టీ నుంచి సస్పెన్షన్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే, వారిద్దపై గతంలో అక్రమంగా గ్రానైట్ వ్యాపారం చేస్తున్నట్టు కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇలా టీడీపీలో అవినీతికికి పాల్పడిన వారిని సస్పెన్షన్ చేసుకుంటూ పోతే.. చివరకు సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి లోకేష్ కూడా టీడీపీలో మిగలరని వైసీపీ నేతలు కామెంట్ చేస్తున్నారు.