యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రణతి దంపతులకు ఇటీవల పండంటి మగ బిడ్డ పుట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు నామకరణ కార్యక్రమాన్ని నిర్వహించారట. చిట్టి ‘టైగర్’కు భార్గవ్ రామ్ అని పేరు పెట్టినట్లు తారక్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. తారక్ తన ఇద్దరు కుమారులు, ప్రణతితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ‘ఈ చిన్నోడి పేరు భార్గవ్ రామ్’ అని పేర్కొంటూ నామకరణ మహోత్సవం, ఫ్యామిలీ టైమ్ అన్న హ్యాష్‌ట్యాగ్స్ ఇచ్చారు. తారక్, అభయ్, ప్రణతి బుల్లి భార్గవ్‌ని ఆప్యాయంగా చూస్తున్న ఈ ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
see also:ఫుట్‌బాల్ ప్లేయర్‌గా సాయి పల్లవి..!
ప్రస్తుతం ఎన్టీఆర్..‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంతో బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో తారక్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో తారక్ చిత్తూరు కుర్రాడి గెటప్‌లో కన్పించనున్నారని, రాయలసీమ నేపథ్యంలో సినిమాను తెరకెక్కించనున్నారని వార్తలు వెలువడుతున్నాయి. దసరాకు ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.