తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బెంగుళూర్ లో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తో ఉదయం భేటీ అయి..అల్ఫాహారం స్వీకరించారు.అనంతరం తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న మిషన్ భగీరథ, హరితహారం వంటి ప్రభుత్వ పథకాలను మంత్రి ఈ సందర్భంగా ఆయనకు వివరించారు..
see also:యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిన్న కొడుకు పేరు ఇదే..ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడి
అనంతరం ముఖ్యమంత్రి కుమారస్వామి తో కలిసి ఓ కన్నడ మూవీ షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి వెళ్లారు . కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి కుమారుడు జాగ్వార్ ఫేం నిఖిల్ గౌడ హీరోగా తెరకెక్కుతున్న సినిమా సీతారామ కల్యాణ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బెంగళూరులో జరుగుతోంది. కుమారస్వామితో కలిసి షూటింగ్ లోకేషన్‌కు వెళ్లిన కేటీఆర్ యూనిట్ సభ్యులతో ముచ్చటించారు. నిఖిల్ గౌడతో కలిసి సినిమా రషెస్ చూసి సాంకేతిక నిపుణులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.