2019 సార్వత్రిక ఎన్నికల గడువు దగ్గరపడుతున్న తరుణంలో ఏపీలో రాజకీయ వాతావరణం రోజు రోజుకు వేడెక్కుతోంది. 2019లో ఏ పార్టీ అధికారం చేపడుతుంది..? ఏపీలో ఏ పార్టీ.. ఎన్ని సీట్లు గెలుస్తుంది..? అన్న ప్రశ్నలను కాసేపు పక్కనపెడితే ప్రస్తుతం ఏపీ కేబినెట్‌లో మంత్రులుగా కొనసాగుతున్న వారి పరిస్థితి కత్తిమీద సాములా మారిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
see also:టీడీపీ 40 కోట్లు కాదు.. 1000 కోట్లు ఇచ్చిన వైసీపీలోనే ఉంట..!
అయితే, ఏపీలో ఏ ఎన్నిక జరిగినా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఇంటెలిజెన్స్‌తో సర్వేలు చేయిస్తూ నిత్యం బిజీబిజీగా గడుపుతారన్న విషయం ప్రతీ ఒక్కరికి విధితమే. అందులో భాగంగానే ఇటీవల కాలంలో చంద్రబాబు ఇంటెలిజెన్స్ సర్వే పది మంది మంత్రులను ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో ఆ పది మంది మంత్రులకు వారి సొంత నియోజకవర్గాలప్రజలను బ్రతిమిలాడుకునే పరిస్థితి దాపురించింది. చంద్రబాబు ఇంటెలిజెన్స్ సర్వే ప్రకారం కేవలం ఆ పది మంది మంత్రులే కాకుండా ఏకంగా టీడీపీనే ప్రమాదపుటంచున ఉందని సీనియర్ రాజకీయ వేత్తలు అభిప్రాయపడుతున్నారు.
see also:చంద్రబాబుకు షాకిస్తూ.. వైసీపీలోకి అధికార పార్టీ ఎమ్మెల్యే..!
ఇక ఆ పది మంది మంత్రులు ఎవరయ్యా అంటే..? కిమిడి కళా వెంకట్రావు, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, పత్తిపాటి పుల్లారావు, భూమా అఖిలప్రియ, ఆది నారాయణరెడ్ఇ, కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చిన్నరాజప్ప, చింతకాయల అయ్యన్నపాత్రుడు, వీరితోపాటు పేరు బయటపడని మరో మంత్రి ఉన్నట్టు సమాచారం.
see also:ఏపీలో వైఎస్ జగన్ దెబ్బకు టీడీపీ నేతల్లో వణుకు..
వీరిలో మంత్రులు అఖిల ప్రియ, ఆది నారాయణలు వైసీపీ గుర్తుపై గెలిచి.. టీడీపీలోకి ఫిరాయించడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకుండా, వీరు వారి వారి నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడల్లా ప్రజల నుంచి చీత్కారాలు ఎదురవుతున్నాయి. ఇక మంత్రి పత్తిపాటి పుల్లారావు మైనింగ్ వ్యవహారాలు నడుపుతూ ప్రజల కోపానికి గురైన విషయం తెలిసిందే. అలాగే, కళా వెంకట్రావు, చిన్నరాజప్ప నియోజకవర్గాల్లో ప్రజలు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర నియోజకవర్గంలో అయితే ప్రజల సమస్యలు చెత్త కుప్పలా పేరుకుపోయాయి. ఇలా ఏపీ కేబినెట్‌లోని మంత్రులు.. వారి వారి నియోజకవర్గాల్లో ప్రజల అభివృద్ధిని, సంక్షేమాన్ని మరిచి పాలనను కొనసాగిస్తుంటంతో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వారికి ఓటమి తప్పదే సంకేతాన్ని రాజకీయ విశ్లేషకులు ఇస్తున్నారు.