మెహ్రీన్ కౌర్ తన రేటును అమాంతం పెంచేసిందట. నిన్నటి వరకు ఒక్కో సినిమాకు రూ.50 లక్షల వరకు పారితోషకం తీసునేదట. కాని, ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.70 లక్షల నుంచొ రూ.80 లక్షలకు పెంచేసిందట. మెహ్రీన్ కౌర్‌కు కాస్త డిమాండ్ ఉండటంతో ఆమెను హీరోయిన్గా పెట్టుకునే చిత్ర బృందం చేసేది లేక.. మెహ్రీన్ డిమాండ్ చేసిన మొత్తాన్ని చెల్లించేందుకు ఒప్పుకుంటున్నారట. ఒకేసారి రూ.20 లక్షలకు పైగా పారితోషకం పెంచడంతో కొంత మంది నిర్మాతలు షాకవుతున్నారట.
see also:వచ్చిరాగానే మరోసారి”కత్తి దూసిన “మహేష్ ..!
తాజాగా, నందమూరి కల్యాణ్ రామ్ సరసన నటించేందుకు మెహ్రీన్ కౌర్ రూ.70 లక్షలు డిమాండ్ చేయడంతో.. నిర్మాతలు తప్పక ఒప్పుకుని అంత మొత్తాన్ని ఇచ్చేందుకు సిద్ధమయ్యారట. 22 ఏళ్ల ఈ భామ కృష్ణగాడి వీర ప్రేమ గాధ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తరువాత మహానుభావుడు, రాజా ది గ్రేట్, జవాన్, కేరాఫ్ సూర్య చిత్రాల్లో నటించింది. తాజాగా గోపీచంద్ సరసన పంత చిత్రంలో నటించింది. మెహ్రీన్ కౌర్ చేసింది తక్కువ చిత్రాలు అయినా.. సక్సెస్ రేట్ చాలా ఎక్కువగానే ఉంది.