ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారు. వైఎస్ జగన్ పాదయాత్రను ప్రారంభించినప్పట్నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్‌పై ప్రజల్లో అభిమానం పరవళ్లు తొక్కుతూనే ఉంది. పాదయాత్రలో భాగంగా జగన్ వెంట మేము సైతం అంటూ ప్రజలు అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు సర్కార్ అవినీతి, చేస్తున్న దోపిడీని ప్రతీ ఒక్కరికి తెలిపేందుకు వైసీపీ నిర్వహించే సభలకు ప్రజలు పోటెత్తుతున్నారు. సభలో భాగంగా వైఎస్ జగన్ కథల రూపంలో చంద్రబాబు సర్కార్ అవినీతిని ప్రజలకు వివరిస్తున్న విషయం తెలిసిందే. మరో పక్క ప్రజలను జగన్ చెప్పిన కథలు ఆలోచింప చేస్తున్నాయి. ప్రభుత్వ అవినీతిని ప్రజలకు కళ్లకు కడుతున్నాయి.
see also:టీడీపీ 40 కోట్లు కాదు.. 1000 కోట్లు ఇచ్చిన వైసీపీలోనే ఉంట..!
ఇదిలా ఉండగా, ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్‌ను కోలంక గ్రామానికి చెందిన రాథా కృష్ణ కలిశారు. అయితే, రాథాకృష్ణ దివ్యాంగుడు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో రాథాకృష్ణకు మూడు చక్రాల సైకిల్‌ను, ఉండేందుకు ఒక ఇళ్లు, సైకిల్ షాపు పెట్టుకునేందుకు బ్యాంకుల నుంచి రుణం మంజూరు చేయించారు. ఆ విషయాన్నే వైఎస్ జగన్‌కు చెప్పాడు రాథాకృష్ణ.
see also:చంద్రబాబుకు షాకిస్తూ.. వైసీపీలోకి అధికార పార్టీ ఎమ్మెల్యే..!
వైఎస్ఆర్ చేసిన సాయంతో ఎంతో సుఖంతో జీవనం సాగిస్తున్నసమయంలో తాను పెట్టుకున్న సైకిల్ షాపులో కొందరు దుండగులు చొరబడి.. కొన్ని సైకిళ్లను ఎత్తుకెళ్లారని, అప్పట్నుంచి తమకు మళ్లీ కష్టకాలం ఎదురైందని చెప్పారు. దీంతో మళ్లీ కొత్త సైకిళ్లను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు సర్కార్ హయాంలో రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే ఫలితం లేకుండా పోయిందన్నారు. వైఎస్ఆర్ అభిమానినైన తనకు చంద్రబాబు సర్కార్ రుణం మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన వైఎస్ జగన్ కన్నీటి పర్యంతమైన రాథాకృష్ణను ఓదార్చారు. త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని రాథాకృష్ణలో భరోసా నింపారు వైఎస్ జగన్.