వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారు. అంతేకాకుండా, చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్‌కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు అర్జీల రూపంలో వారి సమస్యలను జగన్‌కు తెలుపుకుంటున్నారు. పింఛన్లు రావడం లేదని, వృద్ధులు, చంద్రబాబు సర్కార్ ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా వదల్లేదని నిరుద్యోగులు, తమకు రుణ మాఫీ కాలేదని రైతులు, డ్వాక్రా సంఘాల మహిళలు ఇలా ఒక్కొక్కరుగా జగన్‌కు సమస్యలను వివరిస్తున్నారు. ప్రజల సమస్యలన్నిటిని ఎంతో సహనంతో వింటూ.. తానున్నానన్న భరోసాను ప్రజల్లో కల్పిస్తూ వైఎస్ జగన్ తన పాదయాత్రను ముందుకు కొనసాగిస్తున్నారు.
ఇదిలా ఉండగా, వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. 204వ రోజులో పాదయాత్ర చేస్తున్న జగన్‌కు.. భారీ వర్షం కారణంగా కొంత అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. భారీ వర్షం కారణంగా ఇవాళ మధ్యాహ్నం నుంచి జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు. ఇదే సందర్భంలో ఉప్పుమిల్లికి చెందిన లక్ష్మమ్మ అనే ఓ వృద్ధురాలు జగన్‌ను కలిసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో తనకు ప్రతీ నెలా పింఛన్ వచ్చేదని, కానీ, నేడు చంద్రబాబు సర్కార్ అధికారం చేపట్టినప్పట్నుంచి తనకు పింఛన్ రాకుండా రద్దు చేశారని జగన్‌తో చెప్పుకుని వాపోయింది. తనకు పింఛన్ తీసుకునే అర్హత ఉన్నప్పటికీ.. చంద్రబాబు నియమించిన జన్మభూమి కమిటీల వారు.. తన వయస్సుకు పింఛన్ తీసుకునేందుకు అర్హత లేదని, తన వయస్సు కేవలం 49 అని తమ పత్రాల్లో నమోదు చేసుకుని వెళ్లారని జగన్‌కు చెప్పింది. అటువంటి చంద్రబాబు పాలన మళ్లీ.. మళ్లీ రాకూడదని, నీవే నాకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని జగన్‌కు వినతిపత్రం అందజేసింది.