గులాబీ దళపతి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి తో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే..కాంగ్రెస్ పార్టీ యే అడ్డుకుంటుందని చివరికి ఆ పార్టీ నేతలే ఒప్పుకుంటున్నారు.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి స్వయంగా ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. కాంగ్రెస్ అవినీతే రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా మారిందని అయన సంచలన వాఖ్యలు.తమ పార్టీ అభివృద్దికి శాపంగా మారిందని అయన అన్నారు.అంతలోనే సర్దుకుని.. సారీ సారీ.. టీఆర్ఎస్ అవినీతే అభివృద్ధికి అడ్డంకి అని విమర్శించారు.
see also:సెయిలింగ్ కు ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తున్నాం..మంత్రి కేటీఆర్
మంగళవారం పార్టీ కార్యాయలంలో విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్పై మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు కాళ్లలో కట్టెలు పెడుతున్నారన్న టీఆర్ఎస్ నేతల మాటలను ఖండిస్తున్నానని చెప్పారు. . కాళేశ్వరం పేరుతో బాంబే తమాషా చూపిస్తున్నారని, కాళేశ్వరం మోటార్లు కాంగ్రెస్ హయాంలో తెచ్చినవే కదా అని వ్యాఖ్యానించారు.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై నాగం జనార్దన్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. ఆయన ప్రవేశ పెట్టిన 108, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయని వివరించారు.
see also:సీఎం కేసీఆర్ కు హ్యాట్సాఫ్.. కేంద్రమంత్రి ఆసక్తికరమైన వాఖ్యలు..!!