అర్జున్‌రెడ్డి చిత్రంలో నటించే అవకాశం వస్తే తిరస్కరించిందట దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాహ్నవి. అయితే, తెలుగునాట అర్జున్‌రెడ్డి చిత్రం ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. అర్జున్ రెడ్డి చిత్రాన్ని అన్ని భాషల్లో రిలీజ్ చేసేందుకు పలువురు నిర్మాతలు ఆసక్తి చూపించారు. ఆ కోవలోనే అర్జున్‌రెడ్డి చిత్రాన్ని హిందీ భాషలోకి డబ్ చేసేందుకు పలువురు నిర్మాతలు ముందుకురాగా.. తానే రీమేక్ చేస్తానని, వచ్చిన వారిని తిరస్కరించారు అర్జున్‌రెడ్డి దర్శకుడు వంగా సందీప్ రెడ్డి.
see also:డ్రగ్స్ వాడకంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సురేష్ బాబు..!
హిందీ అర్జున్‌రెడ్డి చిత్రంలో షాహిద్ కపూర్‌ను హీరోగా అనుకున్న తరువాత శ్రీదేవి కూతురు జాహ్నవిని హీరోయిన్గా అనుకున్నారట. అంతేకాకుండా, జాహ్నవి కూడా అర్జున్‌రెడ్డి చిత్రంలో నటించేందుకు సుముఖత వ్యక్తం చేసిందట. అయితే, ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ అడ్డుపడ్డారట. కెరీర్ ప్రారంభంలోనే బోల్డ్ సీన్స్‌లో నటిస్తే.. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారట. దీంతో అర్జున్ రెడ్డి ఆఫర్‌ను జాహ్నవి తిరస్కరించిందట.