ప్రజల సమస్యలపై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ పాదయాత్రలో భాగంగా రోజులు గడిచేకొద్ది జన ప్రభంజనం పెరుగుతుందే కానీ.. ఎక్కడా తగ్గడం లేదు. ప్రజల్లో అదే ఉత్సాహం.. అదే ఉత్తేజం. ప్రజా సమస్యలు తెలుసుకుంటూనే వైఎస్ జగన్ ముందడుగు వేస్తున్నారు.
see also:రాష్ట్రంలో ఆడవారికి రక్షణ కరువు-సీఎం చంద్రబాబు ..!
కష్టాలు చెప్పుకునేందుకు వస్తున్న వారికి భరోసా ఇస్తూ.. ధైర్యం చెప్తూ జగన్ ముందుకు సాగుతున్నారు. వైఎస్ జగన్‌తో చెప్పుకుంటే కష్టాలు తీరుతాయన్న నమ్మకం ప్రజల్లో కలుగుతోంది. దీంతో గ్రామాలు, పట్టణాలు వైఎస్ జగన్‌కు హారతులు పడుతున్నారు. గోదావరమ్మ సాక్షిగా వైఎస్ జగన్ వేస్తున్న అడుగులు తమకు ఆశా కిరణాలై కనిపిస్తున్నాయని ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు అంటున్నారు.
see also:వన్య ప్రాణులను వేటాడి..హెరిటేజ్ వాహనాల్లో తరలింపు ..!
ఇదిలా ఉండగా, 204వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్రలో కాస్త మార్పు చోటు చేసుకుంది. కాగా, నేడు, రేపు దేశ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జగన్ తన పాదయాత్రకు స్వల్ప విరామం ప్రకటించారు.
see also:తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీకి పెద్ద షాక్..సీనియర్ నేతలు రాజీనామా
అయితే, ప్రజా సంకల్ప యాత్ర 204వ రోజు సందర్భంగా జగన్ మధ్యాహ్నం నుంచి తన పాదయాత్రను కొనసాగించనున్నారు. అంతేకాకుండా, ఇవాళ సాయంత్రం ద్రాక్షారామంలో జరగాల్సిన జగన్ బహిరంగ సభ రేపటికి వాయిదా వేసినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం మీడియాకు తెలియజేశారు.
see also:చంద్రబాబు నిరుద్యోగ భృతి కాదు.. అవి కావాలి..పవన్ కల్యాణ్