ప్రపంచానికి తెలంగాణ అనే పదాన్ని పరిచయం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని రాష్ట్ర విద్యుత్ మరియు ఎస్సీల అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడి నలుగు సంవత్సరాలే అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా దక్షతతో ఇప్పుడు తెలంగాణా రాష్ట్రం 28 రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచిందని ఆయన చెప్పారు .అమెరికా తెలంగాణా అసోసియేషన్ అద్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలలో పాల్గొనేందుకు గాను ఆయన అమెరికా లో పర్యటిస్తున్నారు . హ్యుస్టన్ లో జరిగిన ఉత్సవాలలో పాల్గొన్న ఆయన అనంతరం నార్త్ కరోలినా లోని చార్లేట్ వద్ద “చార్లేట్ తెలంగాణా అసోసియేషన్” అధ్వర్యంలో జరిగిన వనబోజనలా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రవాసులతో కల్సి ఆయన చేపల వేటలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు.
ఈ సందర్బంగా చార్లేట్ తెలంగాణ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రం ఇప్పుడు 17 %గ్రోత్ తో ప్రగతిపధానదుసుకపోతుందన్నారు. రాష్ట్రంగా ఏర్పడ్డ ఆనతి కాలంలోనే ఇంతటి అభివృద్ధికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ పడుతున్న శ్రమ అని ఆయన అభివర్ణించారు. రేపటి తెలంగాణా రాష్ట్రాన్ని సస్య శ్యామలం చేయనున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం ముఖ్యమంత్రి కేసీఆర్ స్వీయ సారాద్యంలోనే నిర్మాణం జరుగుతుందన్నారు. ఆయనే ఒక ఇంజినీర్ గా మారి కాళేశ్వరం వంటి అద్బుతమైన ప్రాజెక్ట్ కు రూపకల్పన చేసిన మహాశిల్పి కేసీఆర్ అని ఆయన కొనియాడారు. ప్రతి రోజు యావత్ భారతదేశంలోని 28 రాష్ట్రాలనుండి తెలంగాణా లో జరుగుతున్న అభివృద్దిని అద్యయనం చెయ్యడంతో పాటు వారి వారి రాష్ట్రాలలో అమలు పరిచేందుకు తెలంగాణా రాష్ట్రాన్ని సందర్శిస్తున్న ప్రతినిదుల బృందాల పర్యటనలె ఇందుకు అద్దం పడుతోందన్నారు.మిషన్ కాకతీయ ,మిషన్ భగీరధ వంటి పధకాలను యావత్ భారతదేశం మార్గదర్శకంగా ఎంచుకున్న విషయాన్ని ప్రవాసులు విస్మరించారదాని ఆయన పిలుపునిచ్చారు.
ప్రస్తుతం యావత్ ప్రపంచానికి తెలంగాణా సంస్కృతి,సంప్రాదాయాలు ఒక దిక్షుచిగా మారాయన్నారు.మూడున్నర వేల జాతులలో తెలంగాణా సంస్కృతి,సంప్రాదాయానికి ప్రత్యేకస్థానం ఉందని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పుకొచ్చారు.ఎవరికీ లేని బతుకమ్మ మన సొంతం అయినందుకు గర్వపడాలని ఆయన ప్రవాసులకు ఉద్బోదించారు.ఆమెరికా లోను తెలంగాణా సంస్కృతి,సంప్రాదాయాలు కాపాడుతున్న తెలంగాణా బిడ్డలు అభినందనీయులు అని ఆయన కొని యాడారు.