ఇండస్ట్రీలో కొన్ని రిలేషన్స్ ఎప్పటికీ అర్థం కావు. అలాంటి వారి గురించి చెప్పుకోవాల్సి వస్తే సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇద్దరూ కళాకారులే. బుల్లితెరపై ఎంతో గుర్తింపు తెచ్చుకున్న వీరిద్దరూ వెండితెరపై కూడా రాణిస్తున్నారు. అంతేకాకుండా, ఇద్దరు కలిసి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. జబర్దస్త్‌లో ఆర్టిస్టుగా సుధీర్, యాంకర్‌గా రష్మీ ఎంత పాపులారిటీ సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ కలిసి ప్రోగ్రామ్ చేస్తున్నారంటే చాలు.. దాని టీఆర్పీ ఆకాశాన్నంటుతుంది. దీనికి ప్రత్యేక కారణమంటూ ఏమీ లేదు. ఉన్నదల్లా వారిద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రమే.
see also:7 లక్షలు ఇచ్చి మరీ..?
అయితే, సుధీర్, రష్మీలు నిజంగా ప్రేమికులని, తమ కెరీర్ కోసం వారు చాలా కష్టపడుతున్నారంటూ ఇటీవల కాలంలో చాలా కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. వారిద్దరూ కలిసినప్పుడు చూసిన ఎవరైనా లవర్సనే అనుకుంటారు. ఇదిలా ఉండగా, ఇటీవల ఓ డ్యాన్స్ ప్రోగ్రామ్‌లో పాల్గొని సుధీర్ మాట్లాడిన మాటలు పలువురిని ఎమోషనల్‌కు గురి చేశాయి. నేను చనిపోతే రష్మీ ఏడుస్తుందో.. లేదో.. తెలీదు కానీ.. ఆమె చనిపోతే మాత్రం నేను ఏడుస్తానంటూ సుధీర్ చెప్పడంతో అక్కడ ఉన్నవారంతా షాక్ తిన్నారు. రష్మీ నా సొంతం కాకపోయినా.. ఆమె ఉంటే చాలని బతికేస్తున్న వాడ్ని నేను అంటూ సుధీర్ తన ప్రేమనంతా కుమ్మరించడంతో రష్మీ కంటతడిపెట్టినట్టు తెలుస్తోంది.