ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న పరిణామాలతో ప్రతిపక్షాల నేతల గుండెల్లో గుబులు మొదలయ్యిందని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. సీఎం కేసీఆర్ పాలన మెచ్చిన ఇతర పార్టీల నాయకులు పెద్ద ఎత్తున టీఆర్ఎస్‌లో చేరుతున్నారని ఈ పరిణామంతో విపక్ష నేతల్లో వణుకు మొదలైందన్నారు.
see also:అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు
సోమవారం జగిత్యాలలో జరిగిన కార్యక్రమంలో జగిత్యాల మండలం ధరూర్ గ్రామమంతా టీఆర్ఎస్‌లో చేరింది. అలాగే రాయికల్ మండలంలోని పలువురు కాంగ్రెస్, టీడీపీ నేతలు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, జగిత్యాల మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ దామోదర్ రావు తన అనుచరులతో కలసి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ కవిత సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. అలాగే ధరూర్ సర్పంచ్ జలజ, సింగిల్ విండో వైస్ చైర్మన్ చొక్కారావు, ఎంపీటీసీ సురేందర్, జగిత్యాల పట్టణానికి చెందిన డాక్టర్ పెద్ది మల్లేశం చంద్రావతి, బండారి నరేందర్, రఘుపతి, చిట్ల రమణ తదితరులు కూడా టీఆర్ఎస్‌లో చేరారు.
see also:అన్ని వర్గాల అభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యం..మంత్రి కేటీఆర్
పార్టీలో చేరిన వారందరికీ మంత్రి ఈటల, ఎంపి కవిత గులాబి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ చేరికల సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ సబ్బండ వర్గాలకు సీఎం కేసీఆర్ న్యాయం చేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే అన్ని వర్గాల ప్రజలు బాగుపడతారనే భావన అందరిలో నెలకొందని, ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ పార్టీలోకి ఇతర పార్టీలు నేతలు చేరుతున్నారని ఎంపీ కవిత వివరించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీలో చేరిన నేతలను అభినందించారు.