ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చెప్పే అబద్ధాలకు అంతు ఉండదు.. అసమర్ధ, అవినీతి, అబద్ధాల పాలనకు చంద్రబాబు పాలనే నిదర్శనం.. అనుభవంలోనే కాదు.. దేశంలోనే అత్యంత అవినీతి నేతల్లో సీఎం చంద్రబాబునాయుడుది మొదటి స్థానం అంటూ ప్రత్యేక హోదా కోరుతూ ఇటీవల ఎంపీ పదవికి రాజీనామా చేసిన వైసీపీ నేత వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
see also:కొడుకు భవిష్యత్తుకోసం.. ౩౦ ఏళ్ళ టీడీపీ పార్టీకి మాజీ సీనియర్ మంత్రి గుడ్ బై..!
కాగా, ఇవాళ వైసీపీ ఆధ్వర్యంలో అనంతపురం ఎగ్జిబిషన్ మైదానంలో వంచనపై గర్జన దీక్ష నిర్వహించారు. ప్రత్యేక హోదా అంశంతోపాటుగా ప్రభుత్వ మోసపూరిత వైఖరిని, అలాగే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వానికి నిరసనగా వైసీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు నల్లదుస్తులు ధరించి వంచనపై గర్జన దీక్షలో పాల్గొన్నారు.
see also:చరిత్రను తిరగరాసిన వైఎస్ జగన్..!
ఇదిలా ఉండగా, సభలో భాగంగా ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఎంపీ పదవికి రాజీనామా చేసిన వైసీపీ నేత వరప్రసాద్ మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో సింహం సింగిల్‌గా పోటీ చేస్తుందని వైసీపీ నేత వైఎస్ జగన్ ఉద్దేశించి అన్నారు. అలాగే, సీఎం చంద్రబాబు గురించి మాట్లాడుతూ.. ఇతర పార్టీల సహాయం లేకుండా చంద్రబాబు నాయుడు స్వతంత్య్రంగా ముఖ్యమంత్రి అయిన దాఖలాలు లేవన్నారు.