ఏపీలో మహిళలపై రోజు రోజుకు అత్యా చారాలు పెరిగిపోతున్నాయి.ఇలాంటి దారుణాలు పెరిగిపోతున్నా అధికార తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసు కోవడం లేదు.ఈ క్రమంలోనే తాజాగా కర్నూలు జిల్లాలో ఇద్దరు పోలీసులు కీచకులుగా మారారు. ఒంటరిగానున్న మహిళపై అత్యాచారయత్నం చేశారు.
see also:ఘోర రోడ్డు ప్రమాదం..48 మంది మృతి..!
జిల్లాలోని కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లె గ్రామంలో ఓ మహిళ గత కొన్ని రోజులనుండి కూల్ డ్రింక్ షాప్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే మద్యం మత్తులో ఓ ఆకతాయితో కలిసి నాగరాజు, శివరామ్ అనే కానిస్టేబుళ్లు కూల్ డ్రింక్ షాప్ వద్దకు వచ్చారు. ఒంటరిగానున్న ఆ మహిళతో అసభ్యంగా మాట్లాడారు. అంతేకాకుండా ఆమె చేతిలో డబ్బులు పెట్టి అత్యాచార యత్నం చేశారు.
see also:బీటెక్ అమ్మాయిపై సీనియర్ విద్యార్థులు రేప్ చేసి వీడియోలు తీస్తే ..ప్రిన్సిపల్ మరి దారుణం..!
ఈ క్రమంలోనే ఆ మహిళ గట్టిగా కేకలు వేయడంతో ..ఆకతాయితో సహా ఇద్దరు పోలీసులు అక్కడి నుండి పారిపోయారు.. అయితే ఈ సంఘటన శుక్రవారం జరిగింది. ఆలస్యంగా సమాచారం అందుకున్న పోలీసు ఉన్నాతాధికారులు కానిస్టేబుళ్ల నిర్వాకంపై విచారణ జరిపించారు. కీచక కానిస్టేబుళ్లు నాగరాజు, శివరామ్లతో పాటు హాజీవలి అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు.