జనంలేని యాత్ర బీజేపీ జన చైతన్య యాత్ర అని టీఆర్ఎస్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల గురించి బీజేపీ మాట్లాడుతుంటే నవ్వొస్తోందన్నారు. మద్దతు ధరపై బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబడుతోందని, మద్దతు ధర కేంద్రం పరిధిలోని అంశమని అయన అన్నారు. కాంగ్రెస్‌ది అంగడి యాత్ర అయితే బీజేపీది సర్కస్ యాత్రని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను ప్రజలు ప్రధానిగా చూడాలనుకుంటున్నారని ఆయన అన్నారు. డీఎస్‌కు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సీటివ్వకుంటే… టీఆర్ఎస్ ఆయనను రాజ్యసభకు పంపి గౌరవించిందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
