ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా చేస్తున్న పాదయాత్రపై ప్రజల్లో రోజు రోజుకు ఆదరణ పెరుగుతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా, జగన్ పాదయాత్ర నేపథ్యంలో ఇటీవల కాలంలో పలు సంస్థలు చేసిన సర్వేల్లోనూ త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పాలనను కొనసాగిస్తుందని తేల్చి చెప్పాయి. వైసీపీ వందకు పైగా సీట్లు గెలుచుకుని, ఇతర పార్టీల మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా వైఎస్ జగన్ వైసీపీని నడిపిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
see also:ఓటుకు నోటు కేసుకు భయపడి హైదరాబాద్ నుంచి పారిపోయిన పిరికిపంద చంద్రబాబు
ఇలా వైసీపీపై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకాన్ని అంచనా వేసిన పలు పార్టీలకు చెందిన సీనియర్ నేతలు ఇప్పటికే పాదయాత్రలో ఉన్న జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలో దగ్గుబాటి ఫ్యామిలీ కూడా చేరిపోయింది. కాగా, ఇటీవల కాలంలో వైసీపీలోకి దగ్గుబాటి ఫ్యామిలీ అంటూ సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను నిజం చేస్తూ ఇవాళ దగ్గుబాటి పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వైసీపీలో చేరికపై చర్చించారు.
అయితే, ప్రస్తుతం వైఎస్ జగన్ తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. మరో వారం రోజుల్లో తూ.గో.జిల్లాలో జగన్ పాదయాత్రను పూర్తి చేయనున్నట్టు సమాచారం. అయితే, ఆ జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర పూర్తైన తరువాత విశాఖలోకి జగన్ ఎంట్రీ ఇవ్వనున్నారు. జగన్ విశాఖ జిల్లాలో తన పాదయాత్రను ప్రారంభించగానే వైసీపీలో చేరేందుకు తాము సిద్ధంగా ఉన్నామని దగ్గుబాటి వెంకటేశ్వరరావు వెల్లడించారు. మరో రెండు రోజుల్లో తేదీతో సహా అధికారికంగా ఈ విషయంపై స్పష్టత రానుంది. ఇదిలా ఉండగా, వైసీపీ నేతలతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు భేటీ అయిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.