ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా..ఎంపీగా బరిలోకి దిగనున్నరా.. ఇప్పటికే గత నాలుగేళ్ళుగా అధికారాన్ని అడ్డుపెట్టుకోని చేస్తున్న పలు అవినీతి అక్రమాల పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేతతో ఉన్నారా.. గత సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గుప్పించిన ఆరు వందల ఎన్నికల హామీలను తుంగలో తొక్కారా..ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమవ్వడమే కాకుండా విభజన చట్టంలో ఉన్న ప్రత్యేక హోదా ,రైల్వే జోన్ తీసుకురావడంలో విఫలమవ్వడంతో టీడీపీ పార్టీని ఓడించాలని ఎదురుచూస్తున్నారా అంటే అవును అనే అంటున్నారు రాజకీయ వర్గాలు.
see also:ఏపీ స్పీకర్ రూ.150 కోట్ల అవినీతి వెలుగులోకి..!
ఇటివల నిర్వహించిన బాబు సర్వేలో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఉందని తేలడమే కాకుండా వైసీపీ పార్టీకి పట్టం కడ్తారు అని తేలడంతో బాబు ఒకవేళ అప్పటికి రాజకీయ పరిస్థితులు మారి టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా ఉండటానికి..ఒకవేళ ఓడిపోతే కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పడానికి అనువుగా ఉండటానికి ఎంపీగా కూడా ఎన్నికలలో బరిలోకి దిగాలని ఆయన అలోచిస్తున్నారు అని తెలుగు తమ్ముళ్ళు గుసగుసలాడుకుంటున్నారు .
see also:అనంతలో ‘వంచనపై గర్జన’
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేగా ప్రస్తుతం తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా..కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం నుండి ఎంపీగా బరిలోకి దిగనున్నారు అంట.రానున్న ఎన్నికల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్,బీజేపీ పార్టీలకు స్పష్టమైన మెజార్టీ రావడం కష్టమైన పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలు కీలకం కానుండటంతో బాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.చూడాలి మరి బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..
see also:2019లో సింహం సింగిల్‌గా వస్తుంది..!