ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ కూడా కోడెల శివప్రసాద్ వంటి స్పీకర్‌ను చూడలేదు. టీడీపీ పార్టీ పరంగా నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనడం స్పీకర్ పదవిలో ఉన్న కోడెల శివప్రసాద్ కే చెల్లింది.. సత్తెనపల్లి, నర్సారావుపేటలో స్పీకర్ కోడెల శివప్రసాద్, ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న అవినీతికి అంతులేకుండా పోయింది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, నేతలు అంబటి రాంబాబు, మర్రి రాజశేఖర్ అన్నారు.
see also:ఎంపీగా చంద్రబాబు..ఎక్కడ నుండో తెలుసా..!
కాగా, ఇవాళ వారు మీడియా సమావేశం నిర్వహించి మట్లాడారు. ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తామంతా కలిసి నర్సారావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలపై కలియ తిరిగామని, తాము ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్రజలు ఏపీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ అవినీతి గురించే తమకు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగుల నుంచి.. రైల్వే కాంట్రాక్టర్ల వరకు స్పీకర్ కోడెల కుటుంబం అధికారాన్ని అడ్డం పెట్టుకుని కమీషన్లను దండుకుంటుందన్నారు.
see also:అనంతలో ‘వంచనపై గర్జన’
నర్సారావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న సమయంలో తమను రైల్వే కాంట్రాక్టర్లు కలిశారని, కోడెల శివప్రసాద్ కుటుంబం పాల్పడుతున్న కమీషన్ల దందాను వివరించారన్నారు. వారి వద్ద సుమారు కోట్ల రూపాయలకు పైగా కమీషన్లను వసూలు చేశారని రైల్వే కాంట్రాక్టర్లు చెప్పారన్నారు. అలాగే, మిఠాయి దుకాణం యజమానులు కలిసి తమ వద్ద కూడా స్పీకర్ కోడెల శివప్రసాద్ కుటుంబం వసూళ్లకు పాల్పడ్డారని తెలిపారన్నారు. అంతేకాకుండా, ఇటీవల కాలంలో స్పీకర్ కోడెల శివ ప్రసాద్ అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ఇచ్చే మందుల విషయంలోనూ కమీషన్లను దండుకుంటున్నారని, ఆయన అవినీతి అంతటితో ఆగకుండా అసెంబ్లీలో టెంపరరీ ఉద్యోగాలకు కూడా రూ.2 నుంచి మూడు లక్షల రూపాయలు వసూలు చేశారని విమర్శించారు అంబటి రాంబాబు.