ఏపీలో ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గత నాలుగు ఏళ్ళుగా రాష్ట్రంలో ఉన్న దళితుల కోసం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ వారికి అన్ని విధాలుగా అండగా ఉంటున్నారు .
టీడీపీ ప్రభుత్వం దళితుల కోసం నిర్వహించిన దళితతేజం సభతో రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాల గుండెల్లో రైళ్ళు
పరుగెడుతున్నాయి అని రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ ,టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య అన్నారు .టీడీపీ ప్రభుత్వం గత నాలుగు ఏళ్ళుగా దళిత అభివృద్ధికి పెద్ద పీట వేసింది అని ఆయన అన్నారు ..