ఏపీలో అధికారక టీడీపీ పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఎంతగా ఉందో చెప్పడానికి నిలువెత్తు నిదర్శనమైన సంఘటన ఇది. రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొంది టీడీపీలో చేరిన అరకు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుకు హుకుంపేట మండలం గూడ గ్రామాస్తులు ఎదురుతిరిగారు.
ఈ క్రమంలో సదరు ఎమ్మెల్యేకి చెందిన క్వారీను మూసేయ్యాలని దాదాపు పద్నాలుగు రోజుల పాటు ఆందోళన చేస్తున్న పట్టించుకోని ఎమ్మెల్యే తీరుకు నిరసనగా గూడ గ్రామం నుండి హుకుంపేట మండల కార్యాలయం వరకు గ్రామాస్తులందరూ పాదయాత్ర చేశారు.ఈ క్రమంలో సదరు ఎమ్మెల్యేకి ,టీడీపీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు..