తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత ,మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఆ పార్టీని వీడతారు అని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే .హైదరాబాద్ మహానగరానికి చెందిన మాజీ మంత్రి దానం నాగేందర్ అధికార టీఆర్ఎస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న నేపథ్యంలో మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కూడా టీఆర్ఎస్ గూటికి చేరతారు అని వార్తలు చక్కర్లు కొట్టాయి.
అయితే తాను పార్టీ మారతున్నట్లు జరుగుతున్నా ప్రచారం మీద మొట్టమొదటిసారిగా స్పందించారు మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ .ఆయన మీడియాతో మాట్లాడుతూ తానూ పార్టీ వీడుతున్నట్లు వస్తున్నా వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదు.కావాలనే నా వ్యతిరేకులు నాపై విషప్రచారం చేస్తున్నారు .అయిన టీఆర్ఎస్ పార్టీ నుండి ఆహ్వానం తనకు అందలేదు అని ఆయన క్లారిటీ ఇచ్చారు ..