వరంగల్ మహా నగర పాలక సంస్థ మూడోవ,నాల్గోవ డివిజన్ పరిధిలోని గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, వరంగల్ మేయర్ నన్నపునే నరేందర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ పరకాల నియోజకవర్గం అభివృద్ధి లో ముందంజలో ఉందని,కేసీఆర్ గారి కృషి తో మంత్రి కేటీఆర్ గారి సహకారంతో ఎన్నో నిధులతో అభివృద్ధి చేసామని అని అన్నారు.సంక్షేమ పథకాలు అనేవి దేశంలోనే ఎక్కడ లేని విధంగా అమలు అవుతున్నాయి అని,పేదింటి ఆడ బిడ్డలకు కల్యాణ లక్ష్మి పథకం అనేది ఒక గొప్ప వరం అని ఎక్కడ లేని విధంగా తెలంగాణ ఆడ బిడ్డలకు ఒక లక్ష నూట పదహారు రూపాయలు ఇస్తున్న ఘనత మన కేసీఆర్ గారిది అని అన్నారు. రైతులను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు అని అన్నారు.కానీ ఇప్పుడు కేసీఆర్ గారు రైతుల కోసం ఎంతో ఆలోచిస్తున్నారని వారి అందులో భాగంగా రైతుల కోసం పెట్టుబడి సహాయం చేస్తున్నారని,రైతులు ఏదైనా అకాల మరణం అనంతరం వారి కుటుంబాన్ని ఆదుకోవాలని అందుకోసం రైతు బీమా పథకాన్ని ఏర్పాటు చేశారని అని అన్నారు..ప్రతిపక్ష పార్టీలు ఈరోజు తెలంగాణ లో జరుగుతున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని అని అన్నారు..వారికి వచ్చే ఎన్నికల్లో బుద్ది చెప్పాలని అన్నారు.
మేయర్ నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ ఇక్కడ గత పాలకులు మీసాలు మెలేసి రాజకీయం చేసారని,కానీ మీసాలు మెలేయడం రాజకీయం కాదు అని, కార్యకర్తలు నాయకుడిని చూసి మీసం మేలేయాలి కానీ నాయకుడు కార్యకర్తలను చూసి మీసం మెలేయకూడదని అని అన్నారు.గత నాయకులు ప్రజలను భయాందోళన చేస్తూ రాజకీయం చేసారని కానీ ఇప్పుడు మీకు మంచి నాయకుడు ఉన్నాడు అని చల్లా ధర్మారెడ్డి గారు ఎంతో కష్టపడి పైకి వచ్చారని అన్నారు.ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని,చల్లా ధర్మారెడ్డి గారు విలీన గ్రామాల అభివృద్ధి గురించి ఎంతో కష్టపడే వ్యక్తి అని,అన్ని విలీన గ్రామంల్లో కంటే ఈ గ్రామానికి ఎక్కువ నిధులు కేటాయించామని అని అన్నారు..