Home / TELANGANA / 2019 ఎలక్షన్స్ తరువాత “ అరవింద” కుటుంబ సమేతంగా ఎగిరి పోవాల్సిందే..!!

2019 ఎలక్షన్స్ తరువాత “ అరవింద” కుటుంబ సమేతంగా ఎగిరి పోవాల్సిందే..!!

తెలంగాణ ఉద్యమ బిడ్డ , జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు , నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవిత ను విమర్శించే స్థాయి మీ కుటుంబానికి లేదు , పడిపోయిన మీ తండ్రిని తన చేతులతో పైకి లేపి మీ కుటుంబాన్ని నిలబెట్టింది టీఆర్ఎస్ .. ఈ రోజు నిన్ను బీజేపీ చేర్చుకుందిఅంటే మీ నాన్న కు టీఆర్ఎస్ ఇచ్చిన పదవులను చూసి మాత్రమే .. నీకు , నీ అన్న కు నిజామాబాదు లో ఉన్న కీర్తి ప్రత్సిష్ఠలతో నిజామాబాదు జిల్లా లో మీరు కనీసం వార్డ్ మెంబెర్ గ కూడా గెలవలేరు .. కవిత అక్క తెలంగాణ లో ఎక్కడి నుండి ఐన పోటీ చేసి గెలిచే సత్తా ఉన్న నాయకురాలు . నీస్థాయి ని మించి విమర్శలు చేయకు .. నీకు పాపులారిటీ రావాలంటే ఏదైనా ప్రజలకు దగ్గర అయ్యే ప్రయత్నాలు ఏమైనా చెయ్యు.. అంతే కానీ ప్రజాధారణ ఉన్న నాయకులపై విమర్శలు చేస్తే చరిత్ర హీనుడిగా మిగిలిపోతావు .

తరతరాలుగా తెలంగాణ లో వివక్షకు గురవుతున్న మహిళలను మరియు మన సంస్కృతి, సంప్రదాయాలను జాగృతం చేసేందుకు తెలంగాణ జాగృతి అనే సంస్థను స్థాపించి సమైక్యరాష్ట్రంలో గుర్తింపు కోల్పోతున్న బతుకమ్మ పండుగ తాను భుజానేసుకుని ప్రపంచం గుర్తించి గౌరవించేలా విశిష్టతను ఎలుగెత్తి చాటిన ఘనత ఆమెకే దక్కింది. విదేశాల్లో సైతం బతుకమ్మ పండుగను ఎన్ఆర్ఐలు ఘనంగా నిర్వహిస్తున్నారు అంటే దీనికి వెనక కవితక్క కృషి ఎనలేనిది. ఒకమాటలో చెప్పాలంటే మరుగున పడిన బతుకమ్మ పండుగకు పునర్ జీవం పోసింది కవితక్కే.

2009లో ప్రత్యేక రాష్ట్రానికై తన తండ్రి కేసీఆర్ గారు ఆమరణ దీక్షకు పూనుకుంటే కూతురిగా తండ్రి పక్క ఉండాల్సిన సమయంలో తన తండ్రి ఆశయ సాధన కోసం ఉద్యమకారులకు మద్దతుగా నిలబడడమే కాకుండ ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపుతున్న అప్పటి పాలకుల దుర్మార్గాన్ని ఎండగడుతూ అండగా నిలబడింది.

ఒకవైపు ఉద్యమం చేస్తూ ఇంకోవైపు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల విశిష్టతను ఖండాంతరాలకు వ్యాప్తి చెందేలా కృషి చేసారు కవితక్క.తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత పార్లమెంట్ సభ్యురాలిగా గెలిచి తెలంగాణ ప్రగతికై చట్టసభలో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన వాటాలపై గట్టిగా పోరాడుతున్నారు, సీనియర్ పార్లమెంట్ సభ్యులు సైతం కవిత గారు సమస్యలపై వివిధ అంశాలపై చేస్తున్న ప్రసంగాలకు ముగ్ధులైన గొప్ప వక్తగా అభివర్ణించడం విశేషం.

ఉద్యమంలో భాగంగా జాగృతి ద్వారా బతుకమ్మ ను తెలంగాణ మొత్తం నిర్వహించి మహిళలను ఉద్యమం లో భాగస్వాములుగా చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కవిత అక్క పాత్రను జాగృతి వేదికను మరువలేనిది.

సమైక్య పాలనకు చరమ గీతం పాడుతూ, నాలుగు కోట్ల ప్రజల ఆశయాన్ని నెరవేరుస్తూ, వందలాదిమంది బిడ్డల ఆత్మ త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ ఇప్పుడు. ఈ రోజు ప్రపంచం అంత బతుకమ్మ ను సగౌరవంగా జరపడానికి కారణం కవిత ఇది జగం ఎరిగిన సత్యం .ఈ విజయాన్ని తట్టుకోలేని ప్రతిపక్ష నాయకులూ కవిత అక్క పై సంస్కార హీనంగా ,సభ్యత మరచి మాట్లాడటం వారి విజ్ఞతను చూపిస్తుంది .

నిద్రాహారాలు మాని ,తన కుటుంబ సభ్యులను వదిలి మన సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచాన్ని కె పరిచయం చేస్తూ తెలంగాణ ప్రజలు గర్వపడే స్థాయి లో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించి విదేశాల లో ఆయా దేశాలు బతుకమ్మ పండగ ను అధికారికంగా (ప్రభుత్వ సహాయం ) నిర్వహించే స్థాయి కి తీసుకొచ్చిన మన ఆడ బిడ్డ పై విమర్శలా …… తెలంగాణ ఉద్యమం లో, ఇప్పుడు పునర్నిర్మణం లో కవిత అక్క పాత్ర ఏంటో ప్రతి తెలంగాణ బిడ్డకు తెలుసు ..మరి నీ పాత్ర, నీ కుటుంబ పాత్ర ఏంటో చెప్పగలవా ???

  •  సోర్స్ :  కాసర్ల నాగేందర్ రెడ్డి

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat