వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర తూర్పు గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, జగన్ ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా తన పాదయాత్రను ఇడుపులపాయ నుంచి మొదలు పెట్టి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, శనివారం జగన తన పాదయాత్రను ముమ్మడివరంలో కొనసాగించారు. పాదయాత్రలో భాగంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ జగన్ ముమ్మిడివరంలో అడుగుపెట్టగానే ఆ ప్రాంత ప్రజలు పూలతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంలోనే జగన్‌తో చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను చెప్పుకునేందుకు ప్రజలు అర్జీలతో క్యూ కట్టారు. అందులో భాగంగా జగన్‌ను కలిసిన ఆనందంలో కొందరు సెల్ఫీ కూడా దిగారు. ఈ క్రమంలోనే ఓ విద్యార్థి తన తలపై జై జగన్ అంటూ క్రాఫ్ కొట్టుకోవడాన్ని జగన్ గమనించాడు. ఆ విద్యార్థిని తన వద్దకు పిలిచిన జగన్ ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ఆ విద్యార్థి జగన్‌తో కలిసి సెల్ఫీ తీసుకున్నాడు. ఇలా వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్రజలు జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారు.