రాజకీయాల్లో నిలవాలన్నా…గెలవాలన్నా…
వివరాల్లోకి వెళితే…తెలంగాణ ప్రభుత్వం అభివృద్ది- సంక్షేమం జోడెద్దులుగా తన పరిపాలనను ముందుకు తీసుకుపోతోందని మెజార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నట్లు చర్చజరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు సైతం ఇదే విషయాన్ని రుజువు చేశాయి. టీఆర్ఎస్ పార్టీకి జనాధారణను ఎన్నికల ఫలితాత రూపంలో చాటిచెప్పాయి. అదే సమయంలో తెలంగాణలో ప్రజల భావాలకు అద్దంపట్టేలా దరువు.కాం పలు విశ్లేషణాత్మక కథనాలను, వార్తలను ప్రజలకు అందించింది. అయితే ఈ రెంటిని జీర్ణిచంఉకోలేని పలువురు టీఆర్ఎస్ పార్టీని బద్‌నాం చేసేందుకు దరువు.కాంను ఉపయోగించుకున్నారు. టీఆర్ఎస్‌కు ఆదరణ లేదనే పోస్టర్లను తయారుచేయడమే కాకుండా అందుకు ధరువు పోస్టర్‌ను ఉపయోగించుకున్నారు.
ఇలా సోషల్ మీడియాలో మార్ఫింగ్ చిత్రాలతో చిల్లర ప్రచారానికి తెరతీశారు. తద్వారా మార్ఫింగ్ చిత్రాలతో చిల్లర ప్రచారానికి ఒడిగట్టారు. ఈ వైనంపై సోషల్ మీడియాలోని పలువురు నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. ప్రత్యర్థిని నేరుగా ఎదుర్కోలేని వారు మాత్రమే ఇలాంటి కుటిల ఎత్తుగడలను విశ్వసిస్తారని…దరువు.కాం పట్ల, టీఆర్ఎస్ పార్టీ పట్ల స్పష్టత ఉన్నవారు ఇలాంటివి ఏమాత్రం లెక్కలోకి తీసుకోరని స్పష్టం చేస్తున్నారు.