గత నూట తొంబై ఏడు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అధికార టీడీపీ పార్టీ నేత ,ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు ,మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఏజెంట్ గా పనిచేస్తున్నారు అని ఆయన ఫైర్ అయ్యారు.
గత నాలుగు ఏళ్ళుగా ఎటువంటి అవినీతి మచ్చ లేని ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నారు అని ఆయన అన్నారు .అప్పటి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ హయంలో పదేళ్ళ అధికారంలో మంత్రిగా పని చేసిన కన్నా లక్ష్మీ నారాయణ ఆస్తులపై సీబీఐ విచారణ చేయించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ..