వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర సరికొత్త చరిత్రలను సృష్టిస్తోంది. దీంతో దేశ రాజకీయాల్లో పెనుమార్పులకు ఆంధ్రప్రదేశ్ మరో సారి కేంద్ర బిందువుగా మారబోతోందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా వైఎస్ జగన్ ఎండా, చలి, వాన వాటన్నిటినీ లెక్క చేయకుండా ప్రజల మధ్యనే ఉంటూ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు.
కాగా, ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా జగన్ బ్రహ్మరథం పడుతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా, నీవెంటే మేమంటూ ప్రజలు సైతం జగన్ అడుగులో అడుగు వేస్తున్నారు. లక్షల సంఖ్యలో ప్రజలు పాదయాత్రలో ఉన్న జగన్‌ను కలుసుకుని చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను చెప్పుకుంటున్నారు. ఇలా జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్రజలు జగన్‌ను కలిసి తమ సమస్యలను తెలుపుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
ఇదిలా ఉండగా, వైఎస్ జగన్ తన పాదయాత్రలో భాగంగా శనివారం ముమ్మడివరంలో బహిరంగ సభ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సభకు ఇంతకు మునుపెన్నడూ ముమ్మిడివరంలో పాల్గొనని సంఖ్యలో ప్రజలు జగన్ సభకు హాజరయ్యారు. అంతేకాకుండా, సభలో జగన్ ప్రసంగం ముగిసే వరకు.. సభలోనే ఉండి సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు చేయడం గమనార్హం. అయితే, సభలో పాల్గొన్న ప్రజలను చూసిన కొందరు రాజకీయ విశ్లేషకులు.. ఇంతకు మునుపెన్నడూ ముమ్మిడివరంలో ఇంత జనసందోహాన్ని చూడలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.