ప్రభాస్. అమ్మాయిల కలల రాకుమారుడు. తెలుగు సినిమా బాక్సాఫీస్ రేంజ్ ను ఖండాంతరాలు దాటించిన అసలు.. సిసలు కథా నాయకుడు. అలాంటి హీరోకు ఇంకా పెళ్లి గడియలు రాకపోవడం.. నిజంగా కాస్త ఆలోచించాల్సిన విషయమే. అయితే, ప్రభాస్‌కు పెళ్లి అయితే కాలేదు కానీ, సోషల్ మీడియాలో వెలువడుతున్న కథనాలు మాత్రం ప్రభాస్‌కు చాలాసార్లు పెళ్లి చేసేశాయి. ఒకరేమో ప్రభాస్ గొప్పింటి అమ్మాయికి మొగుడు కాబోతున్నాడు అని, మరొకరేమో ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఇలా చాలా రూమర్లు ప్రభాస్ పై వచ్చిన విషయం తెలిసిందే.
see also:సుదీర్‌బాబు నటించిన “నన్నుదోచుకుందువటే” చిత్రం మెదటి లుక్
ఇక ఇదే కాకుండా, ప్రభాస్ ఎవరైనా అమ్మాయితో కాస్త క్లోజ్‌గా ఉంటే చాలు. ఈడో, జోడు ఇలాంటివేమీ చూడకుండా ప్రభాస్ ఆమెను పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు సృష్టించేస్తున్నారు. ఇక రీసెంట్గా కూడా ప్రభాస్‌కు అలాంటి పరిస్థితే ఎదురైంది. సాహో చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్న ప్రభాస్ ఆ సినిమాకు మేకప్ మెన్‌గా పనిచేస్తున్న మిల్లీ మానిక్‌తో కలిసి క్లోజ్‌గా ఉన్న పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఈ పిక్స్‌లో ప్రభాస్ ఆమె బుగ్గపై ముద్దు కూడా పెట్టేశాడు. ఇలా వారిద్దరి పిక్స్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
see also:వైఎస్సార్ బయోపిక్‌లో..యాంకర్ అనసూయ..కర్నూల్ జిల్లాలో ఆ పాత్ర