రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని వేములకొండ గ్రామంలో ఇటీవల ట్రాక్టరు బోల్తా పడి 15 మంది చనిపోయిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి 2 లక్షల రూపాయలను ఇవాళ అందజేశారు. అలాగే చదువుకునే విద్యార్థులకు పీజీ వరకు ఉచిత విద్య అధించడం జరుగుతుందని వారికి హామీ ఇచ్చారు.
అంతేకాకుండా వారందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు త్వరలోనే కట్టిస్తామని హామీ ఇచ్చారు..చనిపోయిన వారి కుటుంబాలలో పెళ్ళీడు వచ్చిన అమ్మాయిలకు తన స్వంత ఖర్చులతో పెళ్లి చేస్తానని కూడా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మాటిచ్చారు.ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి . జిల్లా కలెక్టర్ అనిత రామ చంద్రన్ మరియు ప్రభుత్వ అధికారులు నాయకులు పాల్గొన్నారు..
see also:వ్యవసాయ కూలీలతో “కడియం”..!!