టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావునే చంపాడు.. ఆయన ముందు నేనెంత, సీఎం చంద్రబాబు నన్ను కూడా ఎప్పుడు చంపుతాడో తెలీదు. నాకు చంద్రబాబు నుంచి ప్రాణహాని ఉందంటూ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు.
see also:మీ పని కావాలంటే రూ.10,000-25వేలు కమీషన్ ఇవ్వాల్సిందే-టీడీపీ ఎమ్మెల్సీ..!
కాగా, మోత్కుపల్లి నర్సింహులు ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. జులై 11వ తేదీన తిరుమల తిరుపతిలో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నట్టు తెలిపారు. వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని తనకు ఉన్న ఒక్కగానొక్క కోరికను కోరనున్నటు చెప్పారు. ఏపీలోకి ఎంటరవుతున్న తనను సీఎం చంద్రబాబు తన అనుచర వర్గంతో చంపినా చంపిస్తాడని, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌నే చంపిన చంద్రబాబుకు..
see also:వైసీపీలోకి టీడీపీ కాపు నేత..!
నేనెంత అంటూ మోత్కుపల్లి నర్సింహులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో ఇప్పటికైనా ప్రతిపక్షాలన్నీ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని, చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా అన్ని పార్టీలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మోత్కుపల్లి నర్సింహులు పేర్కొన్నారు.