తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వరంగల్ (రూ), పర్వతగిరి మండలం,రావురు గ్రామం వద్ద చెలుకలో పని చేస్తున్న వ్యవసాయ కూలీలు, రైతులను చూసి మార్గ మధ్యలో వాహనం ఆపి వారితో కాసేపు ముచ్చటించారు..
see also:తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త..
ఈ సందర్బంగా తాను చదువుకునే రోజులలో అమ్మతో పాటు పొలాలలో వ్యవసాయ కూలిగా పని చేయడానికి సొంత ఊర్లోనే కాకుండా వేరే ఊర్లకు కూడా వెళ్ళి ,ఆ పైసలతో పుస్తకాలు కొనుక్కునేవాడినని ఆయన గుర్తు చేసుకున్నారు.అక్కడే ఉన్న వారి టిఫిన్ బాక్సులు తెరిచి చూసారు. అప్పట్లో తాను తీసుకెళ్లిన “సద్దన్నం” గుర్తొచ్చిందని చెప్పారు.
see also:గద్వాల నడిగడ్డపై సీఎం కేసీఆర్ వరాల జల్లు
వారిని ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా అని ఆరా తీసారు.వ్యవసాయ రైతు గుగులోత్ కిషన్ ను రైతు బంధు, కరెంట్ సరఫరా మంచిగా ఉందా అని అడిగారు. తనకు 3 ఎకరాల 16 గుంటలు భూమి ఉందని, రైతు బంధు కింద 13 వేల రూపాయలు నగదు వచ్చిందని కిషన్ తెలిపారు. కరెంట్ సమస్య పోయిందన్నారు.
see also:జూరాల సోర్స్.. సీఎం కేసీఆర్ కీలక ఆదేశం..!!
పిల్లలు ఏం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కడియం అడిగిన ప్రశ్నకు సమాధానంగా తన పిల్లలు ఒకరు బి.టెక్, ఒకరు ఇంటర్ చదువుతున్నారని చెప్పారు.ప్రభుత్వ పథకాలు కల్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్లు సరిగా అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు.తమ తండాలో కొంతమందికి పట్టాలు రాలేదు, ఇప్పించాలని కిషన్ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ని కోరారు.సాదా బైనామాల పట్టాలు కాబట్టి మొదటి విడతలో రాలేదని, ఇప్పుడు తప్పకుండా వస్తాయనిఈ సందర్బంగా కడియం హామీ ఇచ్చారు.