Home / ANDHRAPRADESH / తూర్పు గోదావ‌రి జిల్లాల్లో ప‌చ్చ‌బ్యాచ్ నిర్వాకం..!

తూర్పు గోదావ‌రి జిల్లాల్లో ప‌చ్చ‌బ్యాచ్ నిర్వాకం..!

ఆయ‌నొస్తేనే బాగుంటుందీ.. మ‌ళ్లీ.. మ‌ళ్లీ ఆయ‌నొస్తేనే మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ ఉంటుంది.. క‌ళాశాల‌కు వెళ్లిన మా అమ్మాయి క్షేమంగా తిరిగి ఇంటికి వ‌స్తుంది అంటూ 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో తెలుగుదేశం పార్టీ త‌న ప‌చ్చ మీడియాలో చంద్ర‌బాబు త‌రుపున ప్ర‌చారం చేసిన విష‌యం తెలిసిందే. అయితే, ఆ ఎన్నిక‌ల్లో బీజేపీ, జ‌న‌సేన పార్టీల‌తో పొత్తుపెట్టుకుని పోటీ చేసిన టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేవ‌లం రెండు శాతం ఓట్ల తేడాతో గెలుపొందిన విష‌యం విధిత‌మే.

అయితే, తెలుగుదేశం పార్టీ అలా అధికారం చేప‌ట్టిందో.. లేదో.. ఇలా మ‌హిళ‌ల‌పై దాడులు తీవ్ర స్థాయిలో పెరిగిపోయాయి. సామాన్యుల నుంచి.. ప్ర‌భుత్వ అధికారుల వ‌ర‌కు మ‌హిళ‌ల‌పై టీడీపీ నేత‌ల దాడులు అనేకం. మ‌రికొంద‌రు టీడీపీ నేత‌లైతే ఒక అడుగు ముందుకేసి మ‌హిళ‌ల‌ను వివ‌స్త్ర‌ల‌ను కూడా చేసిన ఘ‌ట‌న‌లు కోకొల్ల‌లు.

ఇదిలా ఉండ‌గా, తూర్పు గోదావ‌రి జిల్లా పి.గ‌న్న‌వ‌రం మండల‌ ప‌రిధిలోగ‌ల లంక‌ల‌గ‌న్న‌వ‌రంలో మ‌రో ఘ‌ట‌న చోటు చేసుకుంది. లంక‌ల‌గ‌న్న‌వ‌రంలోని టీడీపీ నేత‌లు చేసిన నిర్వాకం తెలుసుకుంటే ముక్కున వేలేసుకుంటారు. ఇంత‌కీ అస‌లేం జ‌రిగిందంటే..! మ‌హిళ‌లు స్నానం చేసే స్నాన‌పు గ‌దుల వ‌ద్ద సీసీ కెమెరాలు పెట్టారు. అంతేకాకుండా, వ‌చ్చి పోయే వారికి తెలిసేలా బాతురూము చుట్టూ సీసీ కెమెరాలు పెట్ట‌డం గ‌మ‌నార్హం. అధికార పార్టీలో ఉన్న నేత‌లే ఇలా చేయ‌డంతో.. ఆ మ‌హిళ‌లు చేసేది లేక బిక్కు.. బిక్కుమంటూ జీవ‌నం సాగిస్తున్నారు. టీడీపీ నేత‌ల ఆగ‌డాలు అంత‌టితో ఆగ‌లేదు. మీ చిత్రాలు మా సెల్‌ఫోన్‌లో ఉన్నాయి.. వాటిని ఫేస్‌బుక్‌లో పెడ‌తామంటూ బెదిరిస్తున్నార‌ని ఆ మ‌హిళ‌లు వాపోతున్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat