తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మరోమారు తీవ్ర అసంతృప్తి జ్వాలలు చెలరేగాయి .నిన్న కాక మొన్న ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్న విషయం మరిచిపోకముందే మరో ఎమ్మెల్యే వెలుగులోకి వచ్చారు .
అసలు విషయానికి వస్తే అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై విరుచుకుపడ్డారు .ఈ క్రమంలో తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కత్తి వెంకటస్వామిని నియోజకవర్గ కాంగ్రెస్ నేతగా పరిచయం చేయడంపై మండిపడ్డారు.ఆయన ఇంకా మాట్లాడుతూ నీవలనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు దిగజారిపోతుంది .కనీసం నాలుగు వేల ఓట్లను కూడా తెచ్చుకోలేని నేతను నాతో సమానమైన హోదాలో కూర్చోబెడతారా అని ఫైర్ అవుతూ మాజీ మంత్రి దానం నాగేందర్ బాటలో నడిచారు ..