మోసగాడు అని చిరునామా రాసిన ఉత్తరం ప్రపంచంలో ఎవరికి చేరుతుందో తెలుసా..? ఈ ప్రశ్నను లేవనెత్తిన వ్యక్తి మరెవరో కాదండి బాబోయ్.. స్వయాన టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు. ఈ ప్రశ్నకు సమాధానాన్ని కూడా ఆయనే చెప్పేశారు. ఇంతకీ ఆయన చెప్పిన సమాధానం ఏమిటంటే..? మోసగాడు అని చిరునామా రాసిన ఉత్తరం డైరెక్టుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చేరుతుందని, కావాలంటే మీరు కూడా ఉత్తరంపైన ఉన్న చిరునామా వద్ద మోసగాడు అని రాసి, పోస్టు బాక్సులో వేసి చూడండి.. మరుసటి రోజునే ఆ ఉత్తరం ఏపీ సీఎం చంద్రబాబుకు చేరుతుందంటూ మోత్కుపల్లి వ్యాఖ్యానించారు.
అదేంటి మోసగాడు అని చిరునామా రాసిన ఉత్తరం చంద్రబాబుకు ఎలా చేరుతుందని విలేకరు అడిగిన ప్రశ్నకు మోత్కుపల్లి తనదైన శైలలో సమాధానం ఎప్పారు. మోసగాడు అనే పదానికి సమాన అర్థం చంద్రబాబు అని, చంద్రబాబు అనే పేరుకు అర్థం మోసగాడు అని మోత్కుపల్లి చెప్పారు. ఇలా మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.