చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ పరిధిలో నగరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే రోజా చంద్రబాబుపై మండిపడ్డారు. శనివారం రోజు నగరి మున్సిపాలిటీ 6వ వార్డు సిమెంట్ రోడ్డులో భూమి పూజ కార్యకమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ…ఈ నాలుగు సంవ్సరాలు అంతకుముందు తొమ్మిది సంవ్సరాలు కూడా దళితులకు ఎటువంటి న్యాయం చంద్రబాబు చేయలేదన్నారు. ప్రభుత్వ కేబినెట్ ఉన్న ఒక దళిత మంత్రిని కూడా తీసిపారేశారని విమర్శించారు. ఇంతవరకు ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాక్ పోస్టులు భర్తీ చేయలేదని, చిత్తూరు జిల్లాలో దళిత ఎమ్మార్వోని తన పార్టీ సర్పంచి కొడితే అతనికి సపోర్టు చేసిన ద్రోహి అన్నారు. ఈ నాలుగు సంవ్సరాలు రాష్ట్రం లో ఉన్న దళితుల భూములు అంతా లాక్కొని తన బినామీ లకు అంటగట్టి వారిలో అనందం నింపిన చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. ఈ రోజు దళిత తేజం అని చెప్పి తెలుగుదేశం అండగా ఉంటుంది అనడం సిగ్గుచేటని విమర్శించారు.
