బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తెలంగాణ రాష్ర్టానికి చెందిన ఆ పార్టీ నేతలు ఏమార్చుతున్నారా? తెలంగాణలో ఆ పార్టీకి బలం ఏమీ లేనప్పటికీ కమళనాథులు జాతీయ నాయకత్వాన్ని మభ్య పెడుతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో ఈ చర్చ తెరమీదకు వస్తోంది.
see also;హైదరాబాద్‌కు దేవెగౌడ..సీఎంకేసీఆర్‌తో ప్రత్యేక భేటీ
తెలంగాణ లో బీజేపీ జాతీయ అధ్యక్షడు అమిత్ షా పర్యటన ఖరారు అయింది. వచ్చే జూలై నెల 13న తెలంగాణలో అమిత్ షా పర్యటన ఉండనుంది. బీజేపీ జన చైతన్య యాత్రలో తాను కూడా పాల్గొంటానని రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కు ఫోన్ చేసి తెలిపారని బీజేపీ నాయకులు వివరించారు. జన చైతన్య యాత్ర విజయవంతం అవుతుందని అమిత్ షా సంతోషం వ్యక్తం చేసినట్లు వారు వెల్లడించారు.
see also:19 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ..మంత్రి కేటీఆర్
అయితే, పార్టీలో నుంచి ఓ వైపు పెద్ద ఎత్తున నేతలు వీడిపోతుంటే పార్టీ ముఖ్య నేతలు మాత్రం వారిని నివారించే పరిస్థితి చేయలేదని పేర్కొంటున్నారు. అయినప్పటికీ ఈ పరాభావాన్ని పక్కనపెట్టి జనచైతన్య యాత్రల పేరుతో పర్యటిస్తున్నారని చర్చ జరుగుతోంది. పార్టీ కార్యక్రమాలకు పలు చోట్ల నిరాదరణ ఎదురవుతోందని అయినా గొప్ప ఆదరణ దక్కుతోందని ఢిల్లీకి నివేదికలు ఇస్తోందని కొందరు పేర్కొంటున్నారు.