జన సామాన్యంలోకి దూసుకెళ్తున్న ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను కోనసీమలో ప్రకృతి పలకరించింది. ఆకు పచ్చని అరటి చెట్లు.. ఆకాశాన్నంటేలా ఉన్న కొబ్బరాకులు సాదర స్వాగతం పలికాయి. కారుమబ్బుల్లోంచి నీలి మేఘాలు సంకల్ప సిద్ధిని చల్లటి మనసుతో దీవించాయి. జగన్ పాదయాత్రలో విజయవంతంగా కొనసాగుతుంది. పాదయాత్ర మొదలు నుండి ఇప్పటి వరకు అదికార పార్టీల నుండి అనేక మంది వైసీపీలో చేరారు.
see also:వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ముఉంది..వైఎస్ జగన్
తాజాగా వైసీపీ ముమ్మిడివరం నియోజకవర్గం కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో జెడ్పీ మాజీ చైర్మన్ దున్నా జనార్దనరావు వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. వీరితో పాటు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన మరో 50 మంది నేతలు వైసీపీలో చేరారు. డీసీసీబీ డైరెక్టర్ గోదాశి నాగేశ్వరరావు, కంచుస్తంభం సోని, సలాది శేషారావు, గణేషుల బ్రహ్మానందం, చెవ్వాకుల జోగారావు, కోలా వెంకటేశ్వరరావు, పమ్మిరెడ్డి సత్యనారాయణమూర్తి, వల్లభరెడ్డి వెంకటేశ్వరరావు, అమలాపురానికి చెందిన దొమ్మేటి రాము తదితరులు పార్టీలో చేరారు. వీరందరికీ వైఎస్ జగన్ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
see also;టీడీపీ ఎంపీల అసలు రంగు ఇదే..అందరికి తెలిసేలా షేర్ చేయండి..(వీడియో)
అనంతరం పార్టీలో చేరిన నేతలు మాట్లాడుతూ.. సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని చక్కదిద్దాలంటే జగన్ సీఎం కావాలన్నారు. ప్రజా సంకల్ప యాత్రకు వస్తున్న ఆదరణ చూసి టీడీపీ నాయకుల గుండెల్లో దడ పుడుతోందన్నారు. చంద్రబాబు మోసాలను ప్రజలు గ్రహించి, జననేత జగన్ వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాగా, కాశి రామకృష్ణ, భూపతిరాజు సుదర్శనబాబు, పి.చిట్టిరాజు, పి.నారాయణ, కె.రాజబాబు, ఆకాశం కన్నబాబు, సీహెచ్.సూరిబాబులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.
see also:మహిళల స్నానాలను కెమేరాలో బంధించి పైశాచిక ఆనందాన్ని పొందుతున్న…దేవాదాయ శాఖ ఉద్యోగి