ఏపీలో టీడీపీ నేతలు చేసే పనికి తలపట్టుకుంటున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ర్ట వ్యాప్తంగా ఎక్కడ చూసిన తెలుగు తమ్ముళ్లు హత్యలు, అత్యచారాలు, భూకబ్జాలు, రౌడియిజం చేస్తూ అడ్డంగా ఆడియో..వీడియోల్లో దొరుకుతున్నారు. ఎమ్మార్వో వనజాక్షిపై ఆనాడు జరిగిన దాడిని ఏపీ శాసనసభలో ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గళమెత్తారు.
see also:ఐదు కేజీల బరువు తగ్గాలనుకుంటున్నాను.. రేపట్నుంచి దీక్ష చేస్తా : టీడీపీ ఎంపీ మురళీ మోహన్
ఆరోజు నుండి ఈ రోజు వరకు అడ్డు..అదుపు అనేది లేకుండా మదం ఎక్కి మహిళలపై దాడులు చేస్తునే ఉన్నారు తప్ప తగ్గడం లేదని వైసీపీ నేతలు అంటున్నారు. అయితే ఈ ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పాలని..ప్రజా సమస్యలు తెలుసుకొవలాని వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది.
see also:కర్నూల్ జిల్లాలో దారుణం..9వ తరగతి బాలిక…20 ఏళ్ల యువకుడు
జగన్ ప్రారంభించిన పాదయాత్ర నేటికి 200 రోజులు అయిన 1వ రోజులాగే జనప్రభజనం మద్య కొనసాగుతుంది. అయితే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రైలు కమ్ రోడ్ వంతెనపై వైఎస్ జగన్ నడుస్తుంటే టీడీపీ నేతల గుండెల్లో రైలు పరుగెత్తాయి అంటున్నారు. పాదయాత్రలో బాగంగా రాజమండ్రి బహిరంగా సభలో టీడీపీ ఎంపీ మురళీ మోహన్ పై తీవ్రంగా జగన్ విరుచుకుపడ్డాడు.
see also:మాజీ జడ్పీ చైర్మన్ తో సహా టీడీపీ, కాంగ్రెస్ నేతలు 50 మంది వైసీపీలో చేరిక
మొన్నా మధ్యనే “వెంకన్న చౌదరి” అంటూ వ్యాఖ్యలు చేసి ఆనక లెంపలేసుకున్న మురళి మోహన్ ..అలాగే టీడీపీ నేతలు కులపిచ్చి గురించి వైసీపీ నేతలు పూసగుచ్చినట్టు చెబుతున్నారు. ఇలా ప్రతి తప్పులో టీడీపీ నేతలు ఉంటున్నారు. ఇకపోతే తాజాగా కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం సీరియస్‌గా ఫైట్ చేస్తున్నట్టు రాష్ట్రంలో చెబుతున్న టీడీపీ నేతలు ఢిల్లీలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఏపీ ప్రజల సంక్షేమానికి ఎంతో అవసరమైన సీరియస్ అంశాలపై టీడీపీ ఎంపీలు వేసిన జోక్‌లు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
see also:వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ముఉంది..వైఎస్ జగన్
వారు ఢిల్లీలోని ఏపీ భవన్ సాక్షిగా.. ఏపీ ప్రజలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అంశాలపై వేసిన జోక్‌ల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజమండ్రి టీడీపీ ఎంపీ మురళీ మోహన్ అయితే, ఒక అడుగు ముందుకేసి హక్కుల సాధనలో భాగంగా చేసే దీక్షలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ఐదు కిలోలు తగ్గాలనుకుంటున్నానండీ..
see also:టీడీపీ ఎంపీల అసలు రంగు ఇదే..అందరికి తెలిసేలా షేర్ చేయండి..(వీడియో)
రేపట్నుంచి నేను కూడా దీక్ష చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎంపీ మురళీ మోహన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాని పటా పంచల్ చేశారనేది ఈ వీడియోనే నగ్నసత్యం. ఆనాడు జగన్ చేసిన వాఖ్యల్లో నిజముందని…ఈనాడు దొరికిన వీడియోల్లో నిజముంది కాబట్టి వచ్చే ఎన్నికల్లో మురళీ మోహన్ రాజకీయల నుండి ఔట్ అంటున్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు.