తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యర్రా నారాయణస్వామి కుమారుడు నవీన్ వైసీపీలో చేరనున్నారు. వైసీపీ నేత, ఉండి ఎమ్మెల్యే సర్రాజు ఆయనతో జరిపిన మంతనాలు సఫలీకృతమయ్యాయి. పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తామని… వైసీపీలోకి రావాలంటూ సర్రాజు ఆహ్వానించడంతో… నవీన్ అంగీకరించారు. త్వరలోనే పార్టీ అధినేత జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. వాస్తవానికి తెలుగుదేశం ఆవిర్భావం నుంచి నారాయణస్వామి రాజకీయ జీవితం గడుపుతున్నారు.
see also:మొన్న వైఎస్ జగన్ దెబ్బకు..నిన్న అడ్డంగా దొరికిన వీడియో దెబ్బకు..మురళి మోహన్ ఔట్
అప్ప ట్లోనే జడ్పీ చైర్మన్‌గా ఆయన తిరుగులేని నాయకత్వ పటిమ ప్రదర్శించారు. పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్నందున నారాయణస్వామి ఇప్పుడు వైసీపీలో చేరికపై టీడీపీ నేతలు ఆలోచనలో పడ్డారు. అన్ని ఏళ్లు తెలుగుదేశం పార్టీలో ఉన్నావారే..వైసీపీలో చేరితే నిన్న..మొన్న టీడీపీలో వారి పరిస్థితి ఏమిటి అని గుస గుసలు అడుకుంటున్నట్లు తెలుస్తుంది.
see also:ఐదు కేజీల బరువు తగ్గాలనుకుంటున్నాను.. రేపట్నుంచి దీక్ష చేస్తా : టీడీపీ ఎంపీ మురళీ మోహన్
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి ఎమ్మెల్యేగా నారాయణస్వామి పని చేశారు. ఆయన కుమారుడు నవీన్ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా బాధ్యతలను నిర్వహించారు. కాపు కార్పొరేషన్ ఛైర్మన్ గా అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబును అడిగినప్పటికీ… ఫలితం దక్కలేదు. తన కుమారుడికి ఛైర్మన్ గా అవకాశం ఇవ్వాలని యర్రా పట్టుబట్టినా… చివరకు ఆ పదవిని కొత్తపల్లి సుబ్బరాయుడికి ఇచ్చారు. ఈ నేపథ్యంలో అసంతృప్తికి గురైన నవీన్… తెలుగుదేశం పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చారు.త్వరలోనే వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది.