వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఇడుపులపాయ నుంచి ప్రారంభమై కడప జిల్లా మొదలుకొని.. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, జగన్ ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ పాదయాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్రజలు జగన్‌కు బ్రహ్మ రథం పడుతున్నారు. జగన్‌పై పూల వర్షం కురిపిస్తున్నారు. కాబోయే సీఎం జగనే అంటూ పూల వర్షం కురిపిస్తున్నారు. మరో పక్క వైఎస్ జగన్ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.
see also:టీడీపీకి గుడ్ బై చెప్పి.. వైసీపీలోకి సీనియర్ నేత
తమకు పింఛన్ ఇవ్వడం లేదని వృద్ధులు, నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు చెప్పి తమను మభ్య పెట్టారని నిరుద్యోగులు, తమ రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు మాట తప్పారని రైతులు, డ్వాక్రా మహిళలు ఇలా ప్రతీ ఒక్కరు చంద్రబాబు సర్కార్ నుంచి ఎదుర్కొంటున్న సమస్యలను జగన్‌కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ మాత్రం వారి సమస్యలను ఎంతో ఓపిగ్గా వింటూ.. వారిలో తానున్నానన్న భరోసాను కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.
see also:పవన్ కళ్యాణ్ అభిమానులు మర్యాద తెలియదని అజ్ఞానులు ..రేణూ దేశాయ్ సంచలన వాఖ్యలు
ఇదిలా ఉండగా, ఇటీవల కాలంలో టాలీవుడ్‌కు ప్రముఖ నటులు పోసాని కృష్ణ మురళీ, పృథ్వీరాజ్ ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొని జగన్ వెంట మూడు కిలోమీటర్లు నడిచిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే టాలీవుడ్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను వారు జగన్‌కు వివరించారు. అంతేకాకుండా, త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో జగనే సీఎం అంటూ వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ చెప్పడం గమనార్హం.
see also:
వారితోపాటు జగన్‌కు మద్దుతు తెలిపే వారిలో మేము సైతం అంటూ.. మరికొందరు టాలీవుడ్ ప్రముకులు ముందుకొచ్చిన విషయం తెలిసిందే.
మంచు మోహన్‌బాబు వైఎస్ జగన్ గురించి మీడియాతో మాట్లాడుతూ.. విభజన తరువాత కష్టాల్లో ఉన్న ఏపీ ప్రజలకు సుపరిపాలన అందించాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమవుతుందని చెప్పిన విషయం
తెలిసిందే.
see also:ఐదు కేజీల బరువు తగ్గాలనుకుంటున్నాను.. రేపట్నుంచి దీక్ష చేస్తా : టీడీపీ ఎంపీ మురళీ మోహన్
కోలీవుడ్ హీరో విశాల్ మాట్లాడుతూ.. ఐ డోన్ట్ లైక్ చంద్రబాబు అంటూ పదే పదే చెబుతూ పచ్చమీడియాను సైతం ఖంగుతినేలా చేశాడు. ఐ లైక్ జగన్. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు జగన్‌లా పాదయాత్ర ఎవరూ చేయలేరని చెప్పారు.
see also:మాజీ జడ్పీ చైర్మన్ తో సహా టీడీపీ, కాంగ్రెస్ నేతలు 50 మంది వైసీపీలో చేరిక
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టేలా జగన్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తున్నట్టు చెప్పిన విషయం తెలిసిదే.
టాలీవుడ్ యువ హీరో నిఖిల్ మాట్లాడుతే.. నేను మే నెలలో గుంటూరులో రెండు రోజులపాటు షూటింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను.. అటువంటి వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా 3వేల కిలోమీటర్లు నడవటం అంటే హర్షణీయమని, అటువంటి ధైర్య సాహసాలు ఎవ్వరూ చేయలేరని తెలిపారు.
see also:వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ముఉంది..వైఎస్ జగన్
మంచు విష్ణు మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో పాదయాత్ర చేసిన వారెవ్వరూ ఫెయిల్ కాలేదు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతాడని నమ్ముతున్నట్టు తనదైన శైలిలో చెప్పారు.
మరో కోలీవుడ్ హీరో సూర్య మాట్లాడుతూ.. జగన్ చిన్నప్పట్నుంచి తెలుసు. జగన్ మాట ఇస్తే తప్పే వ్యక్తి కాదు. తాను చెప్పిన మాటకు కట్టుబడి ఎంత దూరమైనా వెళ్లే వ్యక్తి జగన్ అంటూ ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.
see also:టీడీపీ ఎంపీల అసలు రంగు ఇదే..అందరికి తెలిసేలా షేర్ చేయండి..(వీడియో)
దాసరి అరుణ్ కుమార్ జగన్ గురించి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ రాజకీయాల్లో ఒక మగాడ్ని చూస్తున్నట్టు ఉంది అని వ్యాఖ్యానించారు.
టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణం రాజు ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పిన విషయం తెలిసిందే. ఇలా ప్రతీ ఒక్కరూ.. జగన్‌పై వారికున్న అభిమానాన్ని మీడియా వేదికగా చెపుతున్నారు. అంతేకాకుండా, వీరిలో సగం మంది జగన్ పాదయాత్ర పూర్తికాకముందే.. ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొన జగన్ వెంట నడిచే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.