కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ కు చుక్కెదురైంది.అయన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న క్రమమలో ఓ ముసలవ్వ దిమ్మతిరికే షాక్ ఇచ్చింది.వివరాల్లోకి వెళ్తే..అయన నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో ఓ వృద్దురాలిని పలకరించాడు . “అవ్వా మీకు పించన్ వస్తుందా “అని శ్రీ శైలం ఆ వృద్దురాలిని అడిగాడు.
see also:నేడు గద్వాలకి సీఎం కేసీఆర్
ఈ క్రమంలోనే ఆయనకు ఆ వృద్దురాలు ” నెల నెలకు 1000 రూపాయల పించన్ వస్తుంది.కేసీఆర్ కన్నకొడుకులాగా చూసుకుంటున్నాడు” అని సమాధానం ఇచ్చింది.ఆ వృద్దురాలు అలా సమాధాన చెప్పడంతో ఒక్కసారిగా అక్కడున్న కాంగ్రెస్ నేతలందరు షాకు కు గురైయ్యారు . కంగు తిన్న శ్రీశైలం తిరిగి ఆమె మొహం చూడకుండా అక్కడి నిండి వెళ్ళిపోయాడు.ఆ దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
see also:తెలంగాణ అభివృద్ధిపై యూ.ఏ.ఈ విదేశాంగ మంత్రి ప్రశంసలు