టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే గా పోటీ చేయన్నున్నారు అని వస్తున్న వార్తలపై అయన స్పందించారు.ఈ మేరకు అయన ఓ ప్రకటనను విడుదల చేశారు.టీఆర్‌ఎస్‌లో క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా పనిచేయడమే నాకిష్టం.. ఎమ్మెల్యే బరిలో తాను లేనని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
see also:కాంగ్రెస్ బస్సుయాత్ర తుస్సు..బీజేపీ యాత్ర అట్టర్‌ప్లాప్
ఇటీవలి కాలంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లేదా పరకాల నుంచి తాను ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోందని, ఇది పూర్తిగా అసత్యమని ఆయన ఖండించారు.. టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తాను నిరంతరం నిబద్ధతతో కృషి చేస్తానని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు .